తెలంగాణ

ప్రైవేటు వర్సిటీలకు ప్రత్యేక మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నియమాలను ఖరారు చేసింది. గత శాసనసభ సమావేశాల్లో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి జూలై 15న జీవో 17 జారీ చేసింది. దానికి అనుగుణంగా ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు నియమాలను , మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించేందుకు విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు కార్పొరేట్ సంస్థల ద్వారాలు తెరిచేలా నాసిరకంగా ఉన్నాయని, మరింత కఠిన నిబంధనలను చేర్చాలని పలు విద్యార్థి, యువజన సంఘాలు, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, బాలల హక్కుల సంఘం, తెలంగాణ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో 20 ఎకరాలు, మిగిలిన ప్రాంతాల్లో 30 ఎకరాల స్థలాన్ని రిజిస్టర్డ్ సొసైటీ పేరుమీద చూపించాలి. వెయ్యి చదరపు మీటర్ల పాలనా భవనాలతో పాటు మరో 10 వేల చదరపు మీటర్ల తరగతి గదులు, లైబ్రరీలు, లెక్చర్ హాళ్లు, ల్యాబ్‌లు ఉండాలి. 10 కోట్ల రూపాయిలు కార్పస్ ఫండ్ చూపించాలి, మరో 30 కోట్ల రూపాయిలు ఫిక్సిడ్ డిపాజిట్లు చూపించాలి. ఆసక్తి ఉన్న సంస్థలు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ నుండి దరఖాస్తును 50వేలు చెల్లించి పొందాల్సి ఉంటుంది. పది లక్షల రూపాయిలు ప్రాధమిక రుసుంతో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తుంది. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్, జేఎన్‌టీయూ వీసీ, ఉస్మానియా యూనివర్శిటీ వీసీ, ఇద్దరు విద్యా నిపుణులు, కాలేజీయేట్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. వచ్చిన దరఖాస్తుల్లో ప్రాజెక్టు రిపోర్టు, వారి అనుభవం, గతంలో వారు నిర్వహించిన విద్యాసంస్థలు, ప్రస్తుతం ఆయా సంస్థల కార్యకలాపాలు తదితర అంశాలతో పాటు కల్పించిన సౌకర్యాలను కమిటీ పరిశీలిస్తుంది. అవసరమైతే అదనపు సమాచారం పంపించాలని నిపుణుల కమిటీ కోరుతుంది. అనంతరం దరఖాస్తుల అనుమతికి సంబంధించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. దరఖాస్తులను అందుకున్న తర్వాత ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను జారీచేయడమా లేదా అనేది 30 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు పొందిన సంస్థలు ప్రతి ఆరుమాసాలకు తాజా పరిస్థితిని వివరించాల్సి ఉంటుంది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టం క్లాజు 14(1) సూచించిన ప్రకారం చాన్సలర్‌ను నియమించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కోరిన అనంతరం సెర్చికమిటీని నియమించి, తద్వారా చాన్సలర్ నియామకం చేయాలి. యూనివర్శిటీ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ పేర్కొంటూ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా వర్శిటీల్లో 25 శాతం సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో జన్మించిన లేదా కనీసం రెండేళ్లు స్థానికంగా పనిచేసిన వారి పిల్లలు తెలంగాణ విద్యార్థులుగానే పరిగణిస్తారు. యూనివర్శిటీ కనీసం 10 కోట్ల రూపాయిలను ఎండోమెంట్ ఫండ్‌గా చూపించాలి. ప్రతి ఏటా యూనివర్శిటీ పనితీరుపై నివేదికలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.
సరళ నిబంధనలు సరికాదు
ప్రైవేటు యూనివర్శిటీల బిల్లులో చెప్పింది ఒకటైతే నియమనిబంధనల్లో చెప్పింది మరొకటని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు ఎన్ నారాయణ పేర్కొన్నారు. స్థానికులకు 50 శాతం సీట్లు కేటాయించాలని, అలాగే రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. ప్రైవేటు వర్శిటీలకు సూచించిన వౌలిక సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని, 20 ఎకరాల స్థలం చెప్పడం అంటే యూనివర్శిటీలను స్కూళ్ల స్థాయికి తీసుకురావడమేనని తెలంగాణ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు.