తెలంగాణ

హింసను ప్రేరేపించే పోస్టింగ్‌లు పెడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: వాట్సప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పెడితే ఆ గ్రూపునకు చెందిన అడ్మిన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం హెచ్చరించారు. ఇతర దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వీడియోలను కొందరు వాట్సప్ గ్రూపుల్లో పెడుతున్నారు. వీటి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పోలీసులు గమనించారు. దీంతో అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని, అనుచిత, అవాంఛనీయ క్లిప్పింగ్‌లు శాంతికి విఘాతం కలగజేస్తాయని సీపీ స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పక్కా చర్యలు తీసుకుంటున్నామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో వాట్సప్ పోస్టింగ్‌లు, వీడియోలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మొహర్రం, గణేశ్ నవరాత్రి ఉత్సవాలను కలిసి మెలిసి జరుపుకోవాలని సీపీ కోరారు. వాట్సప్‌లలో రెచ్చగొట్టే ప్రసంగాలు, హంసను ప్రేరేపించే వీడియోలు కనిపిస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్‌పై కచ్చితంగా కఠిన చర్యలుంటాయని ఆయన వెల్లడించారు.