తెలంగాణ

రిజర్వేషన్లు కొనసాగించాలి: సీపీఎం నేత తమ్మినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని సీపీఐఎం తెంలగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. తరతరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అత్యంత దుర్బర దారిద్య్రాన్ని అనుభవిస్తూ చదువు, సంపద, ఉద్యోగాలకు నోచుకోలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయాలు, చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి నాగరిక సమాజంలో భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించారని, కానీ దశాబ్దాలు గడిచినా ఆ అవకాశాలను సఫలీకృతం చేయడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయని అన్నారు.
ఆ లక్ష్యాలను సాధించేంత వరకూ రిజర్వేషన్లను కొనసాగించాలని, వాటికి ఏ మాత్రం భంగం కలిగించినా, ప్రజలందరినీ సమీకరించి రిజర్వేషన్ల రక్షణకు సీపీఐఎం పోరాడుతుందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగక సమస్యలను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇండియన్ కమ్యూనిజం అండ్ సోషల్ జస్టిస్ అనే అంశంపై 24వ తేదీన ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే సెమినార్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఎంసీపీఐ అఖిల భారత ప్రధానకార్యదర్శి ఎండీ గౌస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 24వ తేదీన నిర్వహించే సెమిరా ఉద్ధేశ్యాన్ని ఐలయ్య వివరించారు. కార్యక్రమంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఎంసీపీఐ (యు) కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ పాల్గొన్నారు.