తెలంగాణ

ఐటీలో దూసుకెళ్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిని కెటిఆర్ వివరించారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్, ఐటి పరిశ్రమలు అనేక రంగాలకు సంబంధించి అనేక సందేహాలు ఉండేవని, సమర్ధవంతమైన పాలనతో సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్టు చెప్పారు. గత 12 నెలల కాలంలో సింగిల్ విండో విధానంలో 2300 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, లక్షా 30వేల మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి లభించిందన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ విధానం కింద అవినీతికి తావులేని సింగిల్ విండో విధానంలో 15రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యున్నత పారిశ్రామిక విధానమని దేశ దేశాలకు చెందిన కంపెనీలు అభినందిస్తున్నాయని తెలిపారు. టి-హబ్‌లో 200 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఐటి పాలసీ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఐటి ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీని అత్యున్నతస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం 13వేల ఎకరాల భూమి సేకరిస్తామని, ప్రస్తుతం ఆరువేల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, డిసెంబర్‌లో మొదటిదశ ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఫార్మాసిటీలో ఫార్మా వర్శిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. గతంలో ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోసం ధర్నాలు చేసేవారని, ఇప్పుడు పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందజేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కామన్నారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాక 24 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం ఇచ్చారు.
chitram...
ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కెటిఆర్