తెలంగాణ

యథావిధిగా ఆరోగ్యశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర వైద్య మంత్రి సి. లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం జరిపిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు నెలరోజుల్లోగా చెల్లిస్తామని వైద్యమంత్రి హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. సోమవారం రాత్రి నుండే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరిస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు డాక్టర్ భాస్కర్‌రావు, డాక్టర్ సురేష్‌గౌడ్, డాక్టర్ నర్సింగ్‌రెడ్డి తెలిపారు. మంత్రివద్ద చర్చల తర్వాత సోమవారం రాత్రి వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రోగులకు కూడా ఇక్కట్లు కలగవద్దన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇలా ఉండగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వివిధ వ్యాధులకు జరిపే చికిత్సకు చెల్లించే చార్జీలపై గతంలో కుదిరిన ఒప్పందం (ఎంఓయు) పై పునఃపరిశీలన చేసేందుకు, ఇతర అంశాలపై పరిశీలన చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఆరోగ్యశ్రీ సిఇఓ డాక్టర్ ఎం. చంద్రశేఖర్, కార్పోరేట్ ఆసుపత్రుల తరఫున డాక్టర్ భాస్కర్‌రావు, చిన్న ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల తరఫున డాక్టర్ సురేష్‌గౌడ్, డాక్టర్ నర్సింగ్ రెడ్డిలను నియమించారు.