తెలంగాణ

లక్ష్మీ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, ఆగస్టు 23: జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) 14 గేట్లను శుక్రవారం అధికారులు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 47 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా అదే ప్రవాహాన్ని 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు 14 గేట్ల ద్వారా విడుదల చేశారు. బ్యారేజీ సామర్ధ్యం 16.17 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 95.400 మీటర్ల లెవల్‌లో 5.15 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇఇ రమణారెడ్డి తెలిపారు. సరస్వతీ బ్యారేజీ (అన్నారం) వద్ద గేట్లు మూసివేయడంతో ప్రస్తుతం బ్యారేజీలోకి 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో చేరుకుంటుందని, 117.800 మీటర్ల లెవల్‌లో నీరు ఉండగా 8.15 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. కనె్నపల్లి పంపుహౌస్‌లు నిలుపుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.