తెలంగాణ

ప్రజా ఫిర్యాదులకు ‘జనతా జనార్దన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: మెరుగైన పాలనకు, ఫిర్యాదులకు వేదికగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘జనతా జనార్దన్’ యాప్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ తన ట్వీట్టర్‌లో వెల్లడించడంతో పాటు సచివాలయంలో శుక్రవారం అధికారులతో చర్చించారు. ఈ యాప్ టీజర్‌ను ఆయన విడుదల చేశారు. అవినీతిరహిత పాలనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలతో పాటు ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ యాప్ దోహదపడుతుందని సీఎస్ జోషీ అభిప్రాయపడ్డారు. యాప్ నిర్వహణపై వ్యవసాయ, వైద్యఆరోగ్య, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ జోషి చర్చించారు. యాప్ వినియోగం, పని చేసి విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు విస్తృత ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎస్ జోషి దిశా నిర్దేశం చేశారు.