తెలంగాణ

ఆగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: న్యాయాధికారుల ఆందోళన విరమింపజేసేందుకు గవర్నర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. న్యాయమైన తమ డిమాండ్లు ఆమోదించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలని, న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహాన్ న్యాయవాదులకు సూచించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో న్యాయాధికారులు ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్రంతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం స్పందించారు. సిజెఐని టి.న్యాయవాదుల ప్రతినిధి బృందం ఆదివారం ఢిల్లీలో కలిసిన తరువాత సమస్య పరిష్కారమైనట్టేనని అందరూ భావించారు. అయితే సిజెఐ నుంచి ఆందోళన విరమించండి, న్యాయం చేస్తామన్న హితవు తప్ప డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఆందోళన కొనసాగించాలని న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నిర్ణయించారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు నిలుపుదల, ఆందోళనలో సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారులను విధుల్లోకి తీసుకోవాలనే మూడు ప్రధాన డిమాండ్లతో ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లు సంక్లిష్టమైనవి కావడంతో ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆందోళన విరమించండి అని గవర్నర్ సోమవారం తనను కలిసిన న్యాయవాదులను కోరారు. న్యాయాధికారులను ప్రాథమికంగా కేటాయించారని, అది తుది జాబితా కాదని హితవు చెప్పారు. ఆందోళన విరమించాలని గవర్నర్ కోరిన అంశంపై మంగళవారం చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం గవర్నర్ నరసింహాన్‌ను కలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆ రాష్ట్ర సిఎం చంద్రబాబు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త రాజధానిలో సచివాలయ నిర్మాణం గురించి, అసెంబ్లీ, శాసన మండలి భవనాల నిర్మాణం గురించి ప్రకటించిన సిఎం, హైకోర్టు భవన నిర్మాణంపై నిర్ణయం ప్రకటించలేదు. ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటికప్పుడు వెళ్లిపొమ్మని ఎలా చెబుతారు? అని ప్రశ్నించడం తప్ప ఆంధ్రలో హైకోర్టు కోసం భవనం ఎప్పుడు నిర్మిస్తారో చెప్పలేదు.
పోరాటం ఆగదు: జెఎసి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో అడ్వకేట్ జెఏసి ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో గవర్నర్‌తో భేటీ అనంతరం న్యాయవాదుల జెఏసి నాయకులు విలేఖరుల సమాశంలో మాట్లాడుతూ సమ్మె విరమించాలని గవర్నర్ కోరినట్టు చెప్పారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో గవర్నర్ మాట్లాడతామన్నారని తెలిపారు. సమస్య పరిష్కరించాల్సింది కేంద్రమేనని న్యాయవాదులు అన్నారు. న్యాయవాదుల సమస్యలపై బిజెపి ధర్నా రాజకీయ లబ్ధికోసమేనని న్యాయవాదులు ఆరోపించారు. తమ పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు అవసరం లేదని తెలంగాణ న్యాయవాదుల జెఏసి స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదులు సోమవారం ఆందోళనకు దిగారు. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్ పహరాలో మెజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్లాల్సి వచ్చింది.
chitram...
గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందిస్తున్న టి.న్యాయవాదులు