తెలంగాణ

నిలకడగా సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 24: నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులతో నిలకడగా ఉంది. శుక్రవారం సాయంత్రానికే 590 అడుగులకు చేరుకోగా అర్ధరాత్రి 12 గంటల తరువాత సాగర్ డ్యాం రెండు క్రస్టు గేట్ల ద్వారా 3 గంటల పాటు సుమారు 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి ఆపై గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శనివారం సాయంత్రం వరకు 50వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకోగా సాయంత్రం 6గంటల తరువాత శ్రీశైలం నుండి ఎటువంటి నీరు సాగర్ రావడం లేదు. శ్రీశైలానికి ఎగువ నుండి 16,724 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం 883.10 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయం నుండి కుడి కాల్వ ద్వారా 9,189 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,807 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులను మొత్తంగా 53,348 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం సాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులకు 1 పాయింట్ తగ్గుతూ, పెరుగుతూ ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయంలో అలల తాకిడికి సాగర్ డ్యాం క్రస్టు గేట్లపై నుండి కిందికి పాలధారలా పడుతూ సందర్శకులను ఆకట్టుకుంటుంది. 26 గేట్ల ద్వారా పాలనురుగులు పడుతున్న దృశ్యాలను చూస్తూ సందర్శకులు సందడి చేశారు. లాంచీల రాకపోకల ద్వారా టూరిజానికి శనివారం నాడు 1.17 లక్షల రూపాయల ఆదాయం లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు.

చిత్రం...590 అడుగులుగా సాగర్