తెలంగాణ

మహాధర్నాకు టీడీపీ సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామ్య పాలనపై టీడీపీ దండెత్తనుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మహాధర్నా పేరుతో ప్రజలను సమాయత్తం చేయడానికి ప్రయత్నిస్తోంది. సోమవారం చలో ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహాధర్నా ఏర్పాట్లు అన్ని చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నేతలు చెబుతున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు అనేక మంది బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కేడర్ డీలా పడింది. టీడీపీ ఇక ఖాళీ అన్న సంకేతాలు బీజేపీ విస్తృతంగానే ప్రచారం చేస్తోంది. ఈ పరిణామాలు అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. పార్టీ ఖాళీ అవుతోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నంలో పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. పంచాయతీ, జడ్పీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికే కేడర్ ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితిని అంచనావేసే ప్రయత్నమే మహాధర్నా కార్యక్రమని పార్టీ నేతలే చెబుతున్నారు. తెలంగాణలో డబుల్‌బెడ్ రూమ్‌ల నిర్మాణాలలో జాప్యాన్ని నిరసిస్తూ 26న ఇదిరాపార్క్ వద్ద మహాధర్నా విజయవంతం చేయడానకి పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ధర్నాలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారా? లేదా అన్న విషయాన్ని పార్టీ నేతలు స్పష్టం చేయడంలేదు. మహాధర్నాకు అనుకున్నంతగా పార్టీ నేతలు, కేడర్ తరలివస్తే చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మహాధర్నా ఏర్పాట్ల కోసం జంటనగరాల టీడీపీ నేతల్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్షాలను కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ధర్నా కార్యక్రమాన్ని టీడీపీ ఒంటరిగానే చేపట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ ముఖ్యనేతలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కేడర్ ఏమేరకు ఉందో? లేదో తెల్చుకునే ప్రయత్నం పార్టీ నేతలు ఉన్నారు. జిల్లాల్లో పార్టీ నేతల్ని వేళ్లమీద లెక్కపెట్టవచ్చని ఆ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ నాయకులెందరో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. కాగా మహాధర్నాకు తెలంగాణ జిల్లాల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలను సమీకరించాలని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పిలుపునిచ్చారు.‘తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా’ అంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. జిల్లాల్లో ఇప్పటికే 26న మహాధర్నాపై సమావేశాలు నిర్వహించారు. అయితే ఎంత మందిని కదలిస్తారన్నదాన్ని పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మహాధర్నాలో గళమెత్తాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాల నుంచి కేడర్‌ను తరలించడానికి పార్టీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు.