తెలంగాణ

వ్యవసాయ మార్కెట్లలో దళారీలను నియంత్రించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: రైతులు తమ ఉత్పత్తులను అమ్మేటపుడు ధరలు తగ్గించి కొనుగోలు చేసి, ఎగుమతులు చేసేటపుడు ధరలను విపరీతంగా పెంచి మధ్య దళారీలు వేల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పీ జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్‌లు పేర్కొన్నారు. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులు పెట్టిన పెట్టుబడి రాక రుణగ్రస్తులై ఆస్తులు అమ్ముకోవడానికి గాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వ్యవసాయ మార్కెట్లలో మధ్య దళారీలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. 2018-19లవో పసుపు , మిరప, ఉల్లి, ఆముదాలు, జొన్నలు, మొక్క జొన్నలు, తదితర పంటలను రైతులు అతితక్కువ ధరలకు అమ్ముతున్నారని రైతుల నుండి మధ్య దళారీలు కొనుగోలుచేసిన తర్వాత రెట్టింపు ధరలకు ప్రస్తుతం అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 23 పంటలకే మద్దతు ధరలు నిర్ణయించిందని, అవి కూడా అశాస్ర్తియంగా ఉన్నాయని, పసుపు, మిరప, ఉల్లి, ఆముదాలు పంటలకు మద్దతు ధరలు ప్రకటించలేదని, ప్రకటించిన మద్దతు ధరలు కూడా అమలు కాలేదని వారు చెప్పారు. ఏటా ఇదే తతంగం కొనసాగుతోందని ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించే ప్రయత్నం జరగాలని వారు పేర్కొన్నారు.