తెలంగాణ

పాదయాత్రకు అనుమతి నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ : మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు చేపట్టాల్సిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఉదయ సముద్రం (బ్రాహ్మణ వెల్లంల) ఎత్తిపోతల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. బ్రాహ్మణ వెల్లం ఎత్తిపోతల పథకం అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరందించాలన్న డిమాండ్‌తో ప్రాజెక్టు ప్రాంతం నార్కట్‌పల్లి మండలం నుంచి హైద్రాబాద్
జలసౌధ కార్యాలయం వరకు వెంకట్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అనుమతినివ్వాలంటూ స్వయంగా ఆయన రాష్ట్ర డీజీపీకి, రాచకొండ పోలీస్ కమిషనర్‌కు, జిల్లా ఎస్పీకి పెట్టుకున్న లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే వెంకట్‌రెడ్డి పాదయాత్ర అనుమతి అభ్యర్థనను పోలీస్ శాఖ నిరాకరించింది. వేలాదిమందితో సాగే వెంకట్‌రెడ్డి పాదయాత్రతో విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు నెలకొనడంతో పాటు గతంలో వెంకట్‌రెడ్డి చేపట్టిన ప్రజాందోళనల కార్యక్రమాల్లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో పాదయాత్రకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించినట్టు పోలీస్ వర్గాల సమాచారం. కాగా, తన పాదయాత్రకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ వెంకట్‌రెడ్డి దీనిపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. కోర్టు అనుమతితో తాను త్వరలోనే పాదయాత్ర చేపట్టి తీరుతానని మళ్లీ పాదయాత్ర చేపట్టే తేదీలను త్వరలో వెల్లడిస్తానని ప్రకటనలో తెలిపారు. అన్నం పెట్టే రైతన్న కోసం తాను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులతో కలిసి పాదయాత్ర చేస్తానంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ అడ్డుపడి అనుమతినివ్వకపోవడం దారుణమంటూ ఆయన మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతి నిరాకరణ వివాదంపై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. వెంకట్‌రెడ్డి పాదయాత్రకు పోలీస్ శాఖ అనుమతి లభించక వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణులు, ప్రాజెక్టు పరిధిలోని రైతులు అసంతృప్తికి గురయ్యారు.