తెలంగాణ

ఉద్యోగం లేదు, భృతీ లేదు ఎప్పుడిస్తారో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయో , నిరుద్యోగ భృతి ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం లేదని ఎపుడిస్తారో చెప్పడం లేదని ఎఐఎఫ్‌డీవై అధ్యక్షుడు కర్ర రాజిరెడ్డి ప్రశ్నించారు. ఓంకార్ భవన్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పూర్తిస్థాయిలో జరగలేదని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధానకార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ భగత్‌సింగ్ 112వ జయంతి సెప్టెంబర్ 28 వరకూ రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తారు. అదే సందర్భంగా సభ్యత్వం చేపట్టాలని అన్నారు.
ఎఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో సాహిత్యం కూడా ముద్రిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 11న రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంద రవి, నీల రవీందర్, తుకారం నాయక్, మేక మోహన్‌క, కే శ్రీనివాస్, డోలే రామారావు తదితరులు పాల్గొన్నారు.