తెలంగాణ

జూరాలకు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 25: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యాన్ని ఉంచుకొని సాగు, తాగు, ఎత్తిపోతల పథకాలకు నీటిని అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.490 మీటర్లు, 9.604 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ మూసివేయడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి నీటిని నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇదే తరహాలో ఇన్‌ఫ్లో నమోదు అవుతుండడంతో జూరాల ప్రాజెక్టు వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. అదేవిధంగా నెట్టెంపాడు ఎత్తిపోతలకు 2,250, భీమా లిఫ్ట్-1కు 1300, లిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్‌కు 630, జూరాల కుడి, ఎడమ కాలువలకు 1,872, సమాంతర కాలువకు 850, ఆవిరి రూపంలో 95 క్యూసెక్కుల చొప్పున జూరాల నుంచి 6,997 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాలపై ఆధారపడి నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు సాగు, తాగునీటి పథకాలకు ప్రస్తుత పరిస్థితులను చూస్తే గడ్డుకాలమే అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సరైన రీతిలో నీరు అందలేదని తెలుస్తోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం చేరువైనప్పటికి పంట చివరి వరకు నీరు అందుతుందా అన్న అనుమానాలు రైతాంగాన్ని భారీగా వేధిస్తున్నాయి. అదేవిధంగా ఆర్డీఎస్‌కు ఎగువ ప్రాంతం నుంచి నీరు సక్రమంగా రాకపోవడం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగా ఉండడం, కాలువలకు మరమ్మతులు లేకపోవడంతో ఆర్డీఎస్ రైతాంగం కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 11 టీఎంసీలు కావాల్సి ఉండగా కేవలం ఇప్పటివరకు నాలుగు టీఎంసీలే వినియోగించుకోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ఎనిమిది రిజర్వాయర్లు ఉండగా కేవలం రెండు రిజర్వాయర్లకు 90 శాతం నీరు అందించారు. అదేవిధంగా 136 చెరువులు, కుంటలకు నీరు అందించాల్సి ఉండగా వాటికి నేటి వరకు 5 శాతం నీరు కూడా చేరకపోవడంతో నడిగడ్డ వ్యవసాయం నట్టేట్లో దీపంగా మారిందని రైతులు బోరుమంటున్నారు. వరద జలాలపై ఆధారపడి నిర్మితమైన ప్రాజెక్టులకు వరద సమయంలో నీటిని వినియోగించుకోవడంలో అధికారుల అసమర్థత కారణంగా తీవ్రంగా నష్టపోయామని నడిగడ్డ రైతులు మండిపడుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం నాటికి శ్రీశైలం జలాశయంకు 784.555 టీఎంసీల నీరు వెళ్లింది. కళ్లెదుట కృష్ణమ్మ ప్రవహిస్తూ ఈ ప్రాంతం గుండా వెళ్తుంటే నీటిని సద్వినియోగపర్చుకోవడంలో యంత్రాంగం, పాలకులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు.

చిత్రం...పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్న జూరాల జలాశయం