తెలంగాణ

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు నేటి నుండి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సోమవారం నుండి 94 వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభమవుతోంది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని హెచ్‌ఆర్‌డీ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్బాస్ అలీ తెలిపారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ (ఐటీ), ఐఆర్‌ఎస్ (కస్టమ్స్), ఐఎస్‌ఎస్, ఐఈఎస్ కోర్సులకు చెందిన అభ్యర్థుల శిక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు. దాదాపు 140 మంది అభ్యర్థులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కోర్సు 2019 డిసెంబర్ 6 వరకు కొనసాగుతుందని అలీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కే వీ సుబ్రహ్మణ్యం చీఫ్ గెస్ట్‌గా పాల్గొంటారని. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన వివరించారు.