తెలంగాణ

నేడు తుమ్మిడి హెట్టిని సందర్శించనున్న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ నేతలు సోమవారం తుమ్మిడి హెట్టిని సందర్శించనున్నారు. ఈ వివరాలను టీపీసీసీ తెలిపింది. ఈ బృందానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2007 జనవరి 30వవ తేదీన చేవెళ్లకు గోదావరి జలాలను ఆ నాటి సీఎం వైఎస్‌ఆర్ ప్రకటించారన్నారు. రూ.38.5 వేల కోట్లతో తెలంగాణలోని ఏడు జిల్లాలకు 16.4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్తర పథకమన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీ నిర్మాణం ద్వారా 160 టీఎంసీ నీటిని తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసిందనానరు. తెలంగాణకు జలహారంగా భావించామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా మంజూరు చేయిస్తే తెలంగాణకు ఆర్థిక భారం కాకుండా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని ప్రణాళికను కాంగ్రెస్ ఖరారు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించేనాటికి రూ.10వేల కోట్ల పనులను కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు. తుమ్మడి హెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీరు తేవాలని కాంగ్రెస్ యోచించిందన్నారు.
కాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.38వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో చేపట్టిందన్నారు. ఎల్లంపల్లికి దిగువున మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టును శ్రీకారం చుట్టిందన్నారు. ప్రాణహిత నదిపైన తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం జరిపి గ్రావివటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అతి తక్కువగా కనీసం 120 టీఎంసీ నీటిని తరలించవచ్చని భావించామన్నారు.
కేంద్రపరిశీలన సంస్థ వ్యాప్కోస్ ఇక్కడ నీటిని పరిశీలించి 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత నదిపైన తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 160 టీఎంసీ నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నట్లు చెప్పారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తరలించకుండా కేవలం లిఫ్ట్‌లకే ప్రాధాన్యత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వంపైన వత్తిడి తెచ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.