తెలంగాణ

పర్యావరణ అనుమతులపై 12న సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: ప్రాజెక్టులకు అనుమతుల అంశంపై చర్చించేందుకు ఈనెల 12న న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీ సమావేశం జరుగుతుంది. కొరటా- చనాకా బ్యారేజీకి సంబంధించిన పర్యావరణ అంశాలపై ఆదిలాబాద్ జిల్లా సిఇ భగవంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్టన్రు ఆనుకొని ఉన్న పెన్‌గంగపై ఈ బ్యారేజీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న అటవీ పర్యావరణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గచ్చిబౌలి సమీపంలోని పర్యావరణ పరిరక్షణ సంస్థలో ఇటీవల ఒక సదస్సు జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల వల్ల తలెత్తే ముంపు సమస్యలు, ప్రాజెక్టుల వల్ల పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడం వంటి అంశాలపై 12న ఢిల్లీలో చర్చిస్తారు. గ్రామాల ముంపు, ప్రజాభిప్రాయ నివేదికలను జోడించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ అదికార యంత్రాంగం చేస్తున్న కృషి పట్ల ఇపిటిఆర్‌ఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, తుపాకుల గూడెం, భక్తరామదాసు తదితర ప్రాజెక్టుల ద్వారా పర్యావరణ ప్రభావం అంచనాపై తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే నివేదికలు ఇచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.