తెలంగాణ

రంజాన్ విందుకు హాజరైన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం మలక్‌పేటలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెళ్లారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రిపై అత్తరు చల్లి ఉప ముఖ్యమంత్రి సాదారంగా ఆహ్వానం పలికారు. ప్రతి రంజాన్, బక్రీదు పండుగలకు మహమూద్ అలీ ఇంటికి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్టి, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఉన్నారు. రంజాన్ విందు భోజనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇంటికి కూడా ముఖ్యమంత్రి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి పండుగ ఆశ్వీరాదం తీసుకున్నారు.

చిత్రాలు.. రంజాన్ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంట ఆతిథ్యం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర మంత్రులు