తెలంగాణ

అలక కాదు.. హైబీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ : మంత్రివర్గ విస్తరణలో బెర్త్ దక్కక అలకపాన్పుతో అజ్ఞాతంలోకి వెళ్ళిన మాజీ మంత్రి జోగు రామన్న ఉదంతానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాస గృహం నుండి సెక్యూరిటీ గార్డులను వదిలిపెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అదృశ్యమైన జోగురామన్న ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందోళన చెందారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్‌లోని తన నివాస గృహం వద్ద ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన తెలప గా మైనార్టీ వర్గానికి చెందిన రెండు గ్రూపు ల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసిం ది. ముఖ్యమంత్రి
కేసీఆర్ బలహీన వర్గాలకు చెందిన రామన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై కార్యకర్తలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి రామన్న
అనుచరులను చెదరగొట్టారు. అయితే మంగళవారం ఉదయం జోగురామన్న కుటుంబ సభ్యులకు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని, కార్యకర్తలు అందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని సూచించడంతో అజ్ఞాతం ఉదంతానికి తెరపడింది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉంటున్న జోగురామన్న ముఖ్యమంత్రి తీరుపై అసహనంతో క్వార్టర్ ఖాళీ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన భవన సముదాయంలోని 602 నెంబర్ గల గృహానికి మకాం మర్చారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జోగురామన్న సతీమణి రమ, పెద్దకుమారుడు జోగు ప్రేమేందర్ తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటు దక్కుతుందని చివరివరకు ధీమాతో ఉండగా అనూహ్యంగా పదవి దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపంతో కలత చెందారని అన్నారు. అంతేతప్ప అలకకాదని పేర్కొన్నారు. హైబీపీతో విశ్రాంతి తీసుకునేందుకు ఒంటరిగా వెళ్ళిపోయారని వివరణ ఇచ్చారు. తమకు పార్టీపై విధేయత ఉందని, ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం కొంత బాధ కల్గించిందని వాపోయారు. మరోవైపు జోగురామన్నకు అత్యంత సన్నిహితుడైన జడ్పీ వైస్‌చెర్మన్ ఆరే రాజన్న విలేఖరులతో మాట్లాడుతూ జోగురామన్న అలకబూని అదృశ్యమైనట్టు మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని ఖండించారు. ఆనారోగ్యం కారణంగానే ఏకాంతంగా ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారని, పార్టీ అధిష్ఠానం నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఒక రోజు జోగురామన్న అజ్ఞాత ఉదంతానికి ఎట్టకేలకు తెరపడటంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఊరట కల్గించింది.

చిత్రం... మాజీ మంత్రి జోగు రామన్న