తెలంగాణ

పరిశుభ్రతపై ప్రజాచైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుం ట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతా ల్లో దోమల నివారణతో పాటు పరిశుభ్రతకు తమ శాఖ తరఫున అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని అన్నా రు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్య పరచడానికి మంగళవారం ప్రగతి భవన్‌లో తన ఇంటి పరిసరాల పారిశుద్ధ్యానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. దోమల వృద్ధికి అవకాశం ఉన్న నీటి తొట్లు, నీరు నిలువ ఉండే ప్రదేశాలను కేటీఆర్ స్వయంగా శుభ్రం చేశారు. అలాగే ఇంటి మూలల్లో ఉపయోగం లేని వస్తువులను తొలగించడంతో పాటు నీరు నిలువ ఉండే తొట్లు, కాలువల్లో కాలిన అయిల్‌ను పోశారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద లోపల, బయట నీరు నిలువ ఉండే చోట అయిల్ చల్లాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా తమ ఇంటి పరిసరాల శుభ్రతను చేపట్టనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ సందర్భంగా అన్నారు.
చిత్రం...ప్రగతి భవన్ వద్ద మంగళవారం మొక్కల కుండీల్లో మట్టి వేస్తున్న మున్సిపల్ మంత్రి కేటీఆర్