తెలంగాణ

విష జ్వరాలపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట : వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న విషజ్వరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తమై జ్వర పీడితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్ల డించారు. విషజ్వరాలపై జిల్లాల వారీగా సమీక్షలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలతో కలిసి జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, నూతనంగా ప్రారంభమైన వైద్య కళాశాలను తనిఖీచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని అంతా తిరిగి వసతులు పరిశీలించడంతో పాటు జ్వర పీడితులతో మాట్లాడి వైద్య సేవలు, ఆసుపత్రిలో వసతులను గూర్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల విద్యార్ధులతో సమావేశమై విషజ్వరాలపై జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీజన్‌లో సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజమేనని, అయితే జ్వరాలన్నీ
డెంగ్యూ జ్వరాలే అన్నట్టుగా కొందరు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అందువల్ల ప్రజలు పుకార్లను నమ్మొద్దని కోరారు. ప్రబలుతున్న జ్వరాలను ఆరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడుకప్పుడు చర్యలు చేపడుతోందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రతి క్షణం పనిచేస్తున్నారన్నారు. విష జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నందున రాష్ట్రంలో నెలరోజుల పాటు వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపైనే ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల మందులను సరిపడా అందుబాటులో ఉంచామని మంత్రి ఈటల వెల్లడించారు. విష జ్వరాల వ్యాప్తికి పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణమని, అందువల్ల ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి 30రోజుల గ్రామ ప్రణాళికలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులతో సీజనల్ వ్యాధులపై సమీక్షా చేశామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి వైద్య సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల సూచనలు పాటించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో పర్యటించి జ్వరాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, రాష్ట్ర వైద్యా విధాన పరిషత్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.