తెలంగాణ

మనకు తిరుగులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో దూసుకుపోతోంది. హైదరాబాద్ పరిసరాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 1500కు పైగా ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో 5.4 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీల వల్ల 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం ద్వారా రూ.1,09,219 కోట్ల విలువైన ఎగుమతులు చేశారు. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విడుదల చేసిన సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ సర్వే-2019లో ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఐటీ రంగం 7 నుంచి 8 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. హైదరాబాద్ ఐటీ రంగం గరిష్ట స్థాయిలో 17 శాతానికిపైగా వృద్ధిరేటును నమోదు చేసింది. అంటే జాతీయ స్థాయి కంటే రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిరేటు ఎక్కువగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ. 66,276 కోట్లు నమోదైంది. దేశంలో ఐటీ సెక్టార్ నుంచి వచ్చే రెవెన్యూలో హైదరాబాద్ రెండవ స్థానంలోనిలిచింది. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ 11 శాతం కాంట్రిబ్యూట్ చేసింది. ఐటీ రంగంలో నైపుణ్య ఉద్యోగులను పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ నాలెడ్జ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఐసీటీ పాలసీతో పాటు, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజి పాలసీ, ఇన్నోవేషన్ అండ్ రూరల్ టెక్నాలజీ, సెంటర్ పాలసీని ఖరారుచేసింది. ఇంకా డాటా సెంటర్స్ పాలసీ, ఓపెన్ డాటా పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, డాటా అనలిటిక్స్ పాలసీ, ఐవోటీ పాలసీ, ఈ వెస్ట్ పాలసీని ఖరారు చేశారు. టీ హబ్ ఫేస్-2 కోసం మూడు ఎకరాల స్థలంలో 3.50లక్షల చదరపు అడుగుల స్థలంలో ఐటీ ఇంక్యుబేషన్ స్పేస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇకట్కడ 4వేల మంది ఐటీ ఔత్సాహిక పారిశ్రామివేత్తలు, నిపుణులుపనిచేస్తారు. త్వరలో ఈ హబ్‌లో కార్యకలాపాలు ఫ్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాదాపూర్, గచ్ఛిబౌలీ ఐటీ కారిడార్‌తో పాటు బుద్వేల్, కొల్లూరు ప్రాంతాల్లో ఐటీ
క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. అనిమేషన్, వీఎఫ్‌ఎక్స్ ఇమేజీ టవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాయిదుర్గంలో పది ఎకరాల స్థలంలో ఇమేజి టవర్‌ను ఏర్పాటు చేస్తారు. పీపీపీ పద్ధతిలో వెయ్యి కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర టూ టైర్ నగరాల్లో ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.