తెలంగాణ

విద్యా మంత్రికి సమస్యల తో‘రణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబితా ఇంద్రారెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యావిభాగాల అధికారులు మంగళవారం నాడు కలిసి తమ సమస్యలను , పెండింగ్ ఫైళ్ల గురించి వివరించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్‌తో పాటు పలువురు ఇతర నేతలు కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన విషయాలను రాష్ట్ర ప్రజలు అందరికీ తెలియజేయాలని, అందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చొరవ చూపాలని ఆయాచితం శ్రీ్ధర్ విద్యామంత్రిని కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి సబితా తన వద్దకు బొకేలతో రావద్దని, సూచించడంతో ముఖ్యమంత్రి పీఅర్వో గటిక విజయకుమార్ రాసిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని ఆమెకు శ్రీ్ధర్ బహుకరించారు. పూర్వ యుగాల నుండి తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, తెలంగాణ ఉద్యమం , ప్రగతి తదితర అంశాలకు సంబంధించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఉజ్వల ప్రస్థానం లాంటి పుస్తకాలను అన్ని గ్రంథాలయాలకు చేర్చి, ప్రజలకు మన గతం, వర్తమానం గురించి తెలుసుకునే అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలకు వౌలిక సదుపాయాలు కల్పించడానికి మరిన్ని పుస్తకాలు సేకరించడానికి తాను చొరవ చూపుతానని అన్నారు. దాతలు రచయితలు ముందుకు వచ్చి గ్రంథాలయాల ప్రాముఖ్యతను కాపాడటానికి కృషి చేయాలని సబితా పిలుపునిచ్చారు. జాక్టో నేతలు జీ సదానందం గౌడ్, ఈ రఘునందన్, కే కృష్ణుడు, ఎం రాధాకృష్ణ, జీ సోమయ్యలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాధమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతూ ప్రధానోపాధ్యాయుడి పోస్టును మంజూరు చేయాలని కోరారు. భార్యాభర్తలైన ఉపాధ్యాయులు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారని, వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఉపాధ్యాయుల , విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా సబితా వారికి చెప్పారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు సీహెచ్ రాములు, చావ రవి, పి మాణిక్‌రెడ్డిలు కూడా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి జరగాలని అన్నారు. ప్రాధమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, మండలానికి 5 నుండి 10 ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం , తెలుగు మీడియం ఉండేలా చూడాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని అన్నారు. ఇంగ్లీషు మీడియం బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
నేడు సీనియర్ అధికారులతో సమీక్ష
సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు విద్యాశాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ఈ సమీక్ష జరుగుతుంది. వివిధ విభాగాల అధికారులు తమ ప్రస్తుత స్థితి నివేదికలతో హాజరుకావాలని మంత్రి కార్యాలయం ఆదేశించింది. అధికారుల సమీక్ష అనంతరం ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించనున్నారు.
చిత్రం...విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని అభినందిస్తున్న యూటీఎఫ్ నేతలు