తెలంగాణ

కృష్ణపట్నం నుంచి యూరియా వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు నుండి తెలంగాణ రాష్ట్రానికి రెండురోజుల్లో 14,700 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కృష్ణపట్నం ఓడరేవు నుండి కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా వేర్వేరు లారిల్లో నింపారు. జగిత్యాల, పెద్దపల్లిలకు 2,668 టన్నులతో లారీలు బయలు దేరాయి. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు 2,636.50 టన్నుల యూరియా లారీల్లో బయలు దేరినట్టు వెల్లడించారు. నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు 2,716 టన్నుల యూరియాను రవాణా చేస్తున్నారు. సనత్‌నగర్, జడ్చర్లలకు 3,340 మెట్రిక్ టన్నుల యూరియా లారీల్లో వస్తోందని వెల్లడించారు.
చిత్రం...కృష్ణపట్నం ఓడరేవులో లారీలో యూరియాను నింపిన దృశ్యం