తెలంగాణ

కాళేశ్వరం నీటితో కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 10: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ట్రయల్ రన్ చేపట్టి కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ పద్ధతిన మళ్లించగా, రెండు రోజుల క్రితమే వరద కాల్వ ద్వారా శ్రీరాంసాగర్ వరకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎస్సారెస్పీ వరదగేట్ల వద్ద కాళేశ్వరం జలాలను పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి తెరాస నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రి వేములకు మంగళహారతులు, వలలతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి మంత్రి వేముల సైతం వరద గేట్ల వద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతాయో లేదోననే సంశయంతో తాను అనేకసార్లు నిద్రలేని రాత్రులు గడిపానని, ప్రస్తుతం కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీ గడపను ముద్దాడడంతో తన కల నెరవేరినట్లయ్యిందని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. పునరుజ్జీవ పథకం వల్ల 200 కిలోమీటర్ల దిగువ నుండి నీటిని పైకి మళ్లించుకుని ఎస్సారెస్పీని నింపుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. తద్వారా లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎల్లవేళలా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీటి సౌకర్యం ఏర్పాటైందని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సృష్టికర్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని అన్నారు. మూడేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని, ప్రస్తుతం దాని నిర్మాణం పూర్తి చేసుకుని క్రమక్రమంగా ఫలాలను అందిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం సీఎం కేసీఆర్ రేయింబవళ్లు పని చేయడం తాను కళ్లారా చూశానన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించారని మంత్రి వేముల గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగానికి సాగునీటి సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సమకూర్చేందుకు ఎంతటి వ్యయమైనా భరించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలోకి మళ్లించడం ద్వారా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు ఎంతో లబ్ధి చేకూరనుందన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి 60 టీఎంసీల నీటిని మళ్లించుకుంటామని, మరో 3 0టీఎంసీల వరకు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిందన్నారు. దీంతో పంటలకు పుష్కలంగా సాగునీరు అందించుకోవచ్చని, ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే లక్షా 30వేల ఎకరాలకు సాగు జలాలు సమృద్ధిగా సమకూరుతాయని వివరించారు. కాళేశ్వరం పథకంలోని 21వ ప్యాకేజీ పనులను సైతం వచ్చే ఏడాదిన్నర కాలంలోగా పూర్తి చేసి సాగునీటి సౌకర్యం లేని కమ్మర్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, భీమ్‌గల్ మండలాల్లోని ఆయా గ్రామాలకు ప్రయోజనం చేకూరుసాతమని, దీనికోసం 2750కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరిపిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.

చిత్రం... వరదకాల్వ ద్వారా ఎస్సారెస్పీ వరకు చేరుకున్న కాళేశ్వరం జలాలకు పూజలు చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి