తెలంగాణ

సాగర్‌కు వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 10: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. మంగళవారం ఉదయం నుండి శ్రీశైలం నుండి సాగర్‌కు వస్తున్న వరద నీరు పెరుగుతూ వచ్చింది. సోమవారం రాత్రి సాగర్ డ్యాం 8 గేట్ల ద్వారా విడుదల చేసిన అధికారులు మంగళవారం ఉదయం నుండి సాగర్ డ్యాం గేట్లను ఒక్కొక్కటిగా పెంచుతూ 24 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4,13,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే పరిమాణంలో సాగర్ జలాశయం నుండి బయటకు విడుదల చేస్తున్నారు. క్రస్టు గేట్ల ద్వారా 3,54,352 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 10,350 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,022 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,805 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తం 4,13.239 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకు గాను 589.80 అడుగులుగా ఉంది. శ్రీశైలానికి ఎగువ నుండి 3,30,468 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలంలో 884.90 అడుగులుగా ఉంది. సాగర్ డ్యాం ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇంద్రకిరణ్‌కుమార్ మాట్లాడుతూ శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు వచ్చే వరద నీరు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నదని తెలిపారు. సాగర్ డ్యాం క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో మంగళవారం సందర్శకుల రాక ప్రారంభమైంది.

చిత్రం... 24 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు