తెలంగాణ

యూరియా కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో రైతుల అవసరాలను తీర్చడానికి యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఎరువుల సరఫరా, ఇతర అంశాలపై పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతులు కొంత ఆలస్యంగా సాగు ప్రారంభించారని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రైతులు 226665 ఎకరాలలో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలను ఖరీఫ్‌లో సాగుచేస్తున్నారని, వీరికి ఇప్పటివరకు 19816 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసామని తెలిపారు. మొత్తం 10 వేలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని, జిల్లాలో ఇప్పటి వరకు యూరియా కొరత లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైనమేర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ అనవసరపు ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. కొన్ని వాతావరణ కారణాల వలన 11 రోజులు ఆలస్యంగా ఎరువులు వచ్చాయని, వీటి వలన కొంత అసౌకర్యం ఏర్పడిందని అన్నారు. రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో వారికి సబ్సిడీ సొమ్మును అందించడానికి పారదర్శకంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ సేల్స్ విధానం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా రెతుల ఆధార్ కార్డు, వారి వేలిముద్రల ద్వారా మాత్రమే ఎరువులను విక్రయిస్తున్నామని, దీని వల్ల ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రైతులు కొద్దిసేపు వేచిచూడడం వలన లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎరువుల కొరత ఉందని కొందరు దుష్ప్రచారం చేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారని, రైతుల మధ్య గందరగోళం నివారించడానికి తాను క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో పరిస్థితిని అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరైన సమయంలో ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నామని, 24గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని, రైతుల అభ్యున్నతి కోసం కనీస మద్దతు ధరలేని అనేక పంటలకు మార్కెఫెడ్ ద్వారా కనీస మద్దతు ధరపై కొనుగోలు చేస్తున్నామని మంత్రి అన్నారు. శాసనసభ సాక్షిగా రైతుబంధు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ తప్పని సరిగా పెట్టుబడి సొమ్మును వారి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ టెయిల్ టూ ఎండ్, ఆన్ ఆఫ్ విధానం పాటించడం వలన జిల్లాలో రైతులకు మంచి ఉత్పత్తి సాధిస్తున్నామని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మాట్లాడుతూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తూ వారిలో అనవసరమైన భయాందోళలకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం వద్ద అందుబాటులో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జేసీ వనజాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, పెద్దపల్లి ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి