తెలంగాణ

9 నెలలైనా హామీల అమలు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11 : ఎన్నికల ముందు మోసం చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా వాటిని ఏమాత్రం అమలు చేయటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ లోకసభ సభ్యుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన, ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు లక్ష రూపాయల రుణం ఒకేసారి మాఫీ, నిరుద్యోగులకు 3011 రూపాయల భృతి, రైతుబంధు 5 వేల రూపాయలు, జూన్ నుండి సెప్టెంబర్ వరకు చెల్లించకుండా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు కండువాలు కప్పి రాష్ట్రంలో గలీజు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ వారు అసమర్దులు, చేతకాని వారని, నియోజకవర్గం అభివృద్ధి గురించి వారు ఏమాత్రం మాట్లాడరని, ఇతర పార్టీల వారిని చేర్చుకుని ఫ్లెక్సీలు, కండువాలు కప్పి పోలీసులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మహిళా సంఘాలకు రుణాలు కాని వడ్డీ కాని చెల్లించటం లేదని దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాలు పంపీణీ ఎక్కడని, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌లు ఏమయ్యాయని ఉత్తమ్ ప్రశ్నించారు.
రాజకీయం అంటే నిస్వార్ధ ప్రజాసేవని రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 200 కోట్ల రూపాలయతో నాలుగు వేల గృహాల నిర్మాణం ప్రారంభించి 80 శాతం పూర్తి చేయించానని కాని గత ఆరు సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిలిన 20 శాతం పూర్తిచేయలేని చేతకాని స్థితిలో ఉందని అన్నారు. మట్టపల్లి వద్ద కృష్ణానదిపై 50 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించామని అప్రోచ్ రోడ్‌కు 50 లక్షల రూపాయలు ఇవ్వలేకపోయిందని, గుంటూరు జిల్లా వైపు ఏపీ ప్రభుత్వం 50 లక్షలతో అప్రోచ్ రోడ్ నిర్మాణం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ జోలికొస్తే సహించం
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి కాని ఒక వ్యక్తి పురమాయిస్తే కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని చట్టపరంగా, న్యాయంగా, ధర్మంగా వ్యవహరించుకంటే శాంతియుతంగా ఉమ్మడి ప్రతిఘటన తప్పదని ఉత్తమ్ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే సహించమని అధికార పార్టీకి, పోలీసులకు భవిష్యత్తులో వడ్డీతో చెల్లిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ వారి వద్ద చెంచాగిరి చేసుకోండి కాని కాంగ్రెస్ వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అనవసరంగా కేసులు పెడితే మీ అంతు చూస్తామని, చేతనైతే ఈ ప్రాంతం అభివృద్ది చేయండని పోలీసుస్టేషన్ ఎవరి అయ్య జాగీర్ కాదని అన్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇకనైనా అమలు చేయాలని, సీఎం స్పందించాలని కోరుతూ తహశీల్దార్ సైదులుకు వినతిపత్రం అందచేశారు. అంతకుముందు తహశీల్దారు కార్యాలయం ముందు మూడు గంటల పాటు ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈధర్నాలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, ఎండీ నిజాం, ఎరగాని నాగన్న, గూడెపు శ్రీనివాసు, గోపాల్‌నాయక్, మోతీలాల్, బి మట్టయ్య, టి రామకృష్ణారెడ్డి, మంజూనాయక్ తదితరులు మాట్లాడారు.
చిత్రం... హుజూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన, ధర్నాలో
మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి