తెలంగాణ

కస్తూరి బా ట్రస్ట్‌కు సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన సింథియా సజీవ దహనం కేసులో సింథియా, రూపేష్‌ల ఏకైక కుమార్తె సానియాను ఎవరికి అప్పగించాలనే విషయాన్ని రాజేంద్రనగర్ కోర్టు నిర్ణయించాలని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు ప్రకటించింది. దీంతో పోలీసులు సానియా కేసును రాజేంద్రనగర్ కోర్టుకు నివేదించగా ఈ విషయమై సోమవారం విచారిస్తామని, అంతవరకు పాపను కస్తూరి బా ట్రస్ట్ సంరక్షణలో ఉంచాలని రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. సానియాను తమకు అప్పగించాలంటే, తమకు అప్పగించాలంటూ పాప తల్లితండ్రుల కుటుంబ సభ్యులు పోలీసులపై వత్తిడి తేవడంతో శంషాబాద్ పోలీసులు కోర్టుకు నివేదించారు. సింథియా మరణించినప్పటి నుంచి సానియా బాగోగులను గత మూడు రోజులుగా నాయనమ్మ లీలావతే చూస్తున్నారు. కాని వివాదం ముదరడంతో పోలీసులు ఈ పాపను కోర్టు ఆదేశంతో బాలికల సంరక్షణ సంస్ధకు తరలించారు.
ఇదిలా ఉండగా ఇరువురి కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి సమాయత్తమవుతున్నారు.కాని పాప పెంపకం హక్కులు తమకే ఉన్నాయంటూ శంషాబాద్ పోలీసుస్టేషన్ వద్ద రూపేష్ చేతిలో హత్యకు గురైన సింథియా కుటుంబ సభ్యులు పోలీసులపై వత్తిడి తెచ్చారు. దీంతో వరుసగా రెండు రోజులపాటు పోలీసు స్టేషన్ వద్ద కొంతసేపు ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. తమ దేశానికి చెందిన సింథియాను రూపేష్ ప్రేమించి వివాహం చేసుకున్నారని, పాప సానియా సంరక్షణ బాధ్యతను తమకే ఇవ్వాలంటూ సింథియా కుటుంబ సభ్యులు, నైజీరియా దేశానికి చెందినవారు శంషాబాద్ డిసిపి కార్యాలయం వద్ద హల్‌చల్ సృష్టించారు. రూపేష్‌కు ఉరిశిక్ష విధించాలని నినాదాలు చేశారు. భారత్‌లో కాంగో దేశ రాయబారి రోసెట్ ముకు కూడా డిసిపి కార్యాలయానికి వచ్చి సింథియా కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యాయకోవిదుల అభిప్రాయం ప్రకారం తల్లి మరణించినందు వల్ల సహజంగా తండ్రి సంరక్షకుడవుతాడు. ఈ కేసులో బాలిక సానియా బాగోగులు చూసే బాధ్యత తండ్రికే సంక్రమిస్తుందని వారు పేర్కొన్నారు. సున్నితమైన కేసు అయినందు వల్ల కోర్టు బాలిక బాధ్యతను నిర్ణయిస్తుందన్నారు. అలాగే బాలిక ఇష్టా ఇష్టాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
సింథియా సోదరుడు దారిస్ బాబిటీ మాట్లాడుతూ సానియా సంరక్షణ బాధ్యతను తామే స్వీకరిస్తామని, అలాగే సింథియా మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ‘మాకు న్యాయం జరగాలి. మా అమ్మాయి సానియా. ఆమె మంచి చెడులను మేమే చూసుకుంటాం’ అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
కాగా పోలీసులు మాత్రం ఈ కేసులో కోర్టు నిర్ణయమే శిరోధార్యమని తేల్చి చెప్పారు. సింథియా కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామని డిసిపి సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు సానియాను శ క్రవారం కస్తూరి బా ట్రస్ట్‌కు తరలిస్తున్న దృశ్యం