తెలంగాణ

ప్రజల చెంతకు సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలనాసంస్కరణలను ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కే. తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. మసాబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో అధికారులతో బుధవారం ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చిన పురపాలక చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందో అధికారులే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్ధమయితే ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ప్రజలు బాధ్యతగా ఉంటారన్నారు. ప్రజలకు కనీస వౌలిక సదుపాయాలు
కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన
పురపాలికల్లో పాలనపట్ల ప్రజలకు అవగాహన కలగాల్సి ఉందన్నారు. ప్రభుత్వ అలోచనలు వివరించేందుకు త్వరలోనే పురపాలక కమిషనర్లతో హైదరాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి, ప్రజారోగ్య విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో ప్రసంగిస్తున్న కేటీఆర్