తెలంగాణ

మండలిని హుందాగా నడుపుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: సమాజాభివృద్ధికి చట్టసభలే కీలకమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వాటి ఫలితాలు ప్రజలకు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం శాసన మండలి చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. శాసన మండలినుద్దేశించి కొత్త చైర్మన్ మాట్లాడుతూ సభలో పరస్పర విమర్శలు, నిందారోపణల లేకుండా సమన్వయం పాటిస్తే చట్టసభలకు గౌరవం వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తగ్గ పదవిని కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు. పదవికి హుందాతనాన్ని తీసుకువస్తానని సుఖేందర్‌రెడ్డి చెప్పారు. మండలిలో అనుభవజ్ఞులు ఎందరో ఉన్నారని, వారి అభిప్రాయాలు, సూచనలతో సభను గౌరవనీయంగా, సమర్ధవంతంగా నడుపుతానని చైర్మన్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరిగే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి సభ్యులు సహకరించాలన్నారు. సభను విజయవంతం చేయడానికి తాను వందశాతం ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సభలో వ్యక్తిగతంగా కాకుండా సభ్యుల హుందాతనానికి అవకావం ఇస్తానని ఆయన ప్రకటించారు. చట్టాలను ఎలా ఆమోదించుకుంటారో తాను పార్లమెంట్‌లో చూశానని, అదే ధోరణి శాసన మండలిలోనూ అనుసరిద్దామని హితవుపలికారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధికార, ప్రతిపక్షాల సభ్యులకు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు.
బాధ్యతల స్వీకారం
శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మండలి సమావేశాలను ప్రారంభించిన అనంతరం మండలి చైర్మన్‌కు కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందరెడ్డి పేరును ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశీనులు కావాలని, అందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయనను తోడ్కొని రావాలని సభ్యులకు సూచించారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వరరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి, బీజేపీ రామచంద్రరావు, నర్సిరెడ్డి, ఎంఐఎం జాఫ్రీ తదితరులు చైర్మన్ స్థానం వద్దకు తీసుకు వచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత శాసన మండలికి తొలి చైర్మన్‌గా స్వామిగౌడ్ పని చేశారు. రెండోవ వ్యక్తిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
చిత్రం... గుత్తాకు అభినంద నలు తెలియజేస్తున్న మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, విపక్ష నేతలు జీవన్ రెడ్డి, రాంచంద్రరావు