రాష్ట్రీయం

నేడు టి.మెడికల్ ఎంట్రన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఎమ్సెట్-2ను శనివారం నిర్వహించనున్నారు. 56,188 మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు శుక్రవారం నాడు చెప్పారు. ఆంధ్రాలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలకు అభ్యర్థులు పాల్పడకుండా బయోమెట్రిక్ డాటా సేకరణతో పాటు కొన్ని కేంద్రాల్లో జామర్లు వాడుతున్నామని, ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష హాలులోకి గంట ముందే అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రాలో కర్నూలులో 4, తిరుపతిలో 5, విజయవాడలో 13, విశాఖలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని రమణారావు తెలిపారు. తెలంగాణలో ఆదిలాబాద్‌లో 3, హైదరాబాద్‌లో 30, కరీంనగర్‌లో 8, ఖమ్మంలో 4, మహబూబ్‌నగర్‌లో 4, నల్గొండలో 5, నిజామాబాద్‌లో 5, వరంగల్‌లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ ఈ పరీక్ష జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పరీక్ష తొలి కీ విడుదల చేస్తారు. దానిపై 12వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం తుది కీ రూపొందించి, 14న ఫలితాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.