తెలంగాణ

రాష్ట్రంలో, కేంద్రంలో నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహినుద్దీన్ విగ్రహం నుండి స్ఫూర్తియాత్రను చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు సాయుధ పోరాటంపై అవగాహన కల్పించేందుకు ఈ స్ఫూర్తియాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యిటిస్తోందని అన్నారు. ప్రపంచంలోనే స్ఫూర్తిగా నిలిచిన సీపీఐ తెంలగాణ సాయుధ పోరాటం ద్వారా భూమిలేని పేదలకు పది లక్షలకు పైగా ఎకరాలను పంపిణీ చేసిందని అన్నారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సహకారంతో దొరలు భూములను తిరిగి లాక్కున్నారని, భారత ప్రభుత్వానికి లొంగిపోయిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్‌కు సర్దార్ వల్లభాయ్ పటేల్ గవర్నర్ పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరి పక్షమని ప్రశ్నించారు. ఐదేళ్ల నుండి ఇంత వరకూ కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఏ మాత్రం మార్పురాలేదని వారి పాలన నిజాంను తలదనే్న రీతిలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
పుస్తకావిష్కరణ
తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గార్లపాటి రఘుపతి రెడ్డి రాసిన ‘ఉరికంబం ఎక్కుతూ తిరిగొచ్చిన...’ పుస్తకాన్ని స్వాతంత్య్ర సమర యోధుడు చెన్నమనేని హనుమంతరావు ఆవిష్కరించారు.
మహోజ్వలంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం, స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కుల సాధనకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావల్సిన అవసరం ఉందని సభలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు.
చరిత్రలో సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చెన్నమనేని మాట్లాడుతూ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు గొప్ప పేరు ఉందని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలు సాగించాలని అన్నారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వంలోనే నాడు దునే్నవాడికే భూమి, హక్కుల సాధన, స్వాతంత్య్రం కోసం ఉద్యమం జరిగిందని అన్నారు. నాడు రుణ సమస్యలు ఉండేవని, కానీ రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావని పేర్కొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నాడు నైజాం పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదని, రాక్షస కృత్యాలు అణచివేత ఉండేదని పేర్కొన్నారు. ప్రజాపక్షం సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమరయోధులు, కమ్యూనిస్టులు సాగించిన పోరాటం ఫలితంగానే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యిందని అన్నారు. జైన్ మల్లయ్యగుప్త, అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, ఎడ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.