తెలంగాణ

నాగార్జున సాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 12: నాగార్జుసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి వస్తున్న వరదనీరు గురువారం తగ్గుముఖం పట్టడంతో సాగర్ డ్యామ్ నీటిని గ్రామ అధికారులు తగ్గించివేశారు. బుధవారం రాత్రి వరకు 22 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి ఒక్కొక్క గేటును తగ్గిస్తూ సాయంత్రానికి నాలుగు గేట్ల ద్వారా 32 వేల 148 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం వరకు సాగర్ డ్యామ్ ట్రస్ట్ గేట్లను పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు లక్షా 28 వేల 685 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడికాల్వ ద్వారా 10వేల 633 క్యూసెక్కులు ఎడమ కాల్వ ద్వారా 8వేల 280 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33 వేల 414 క్యూసెక్కులు నాలుగు క్రస్ట్ గేట్లను ఐదు ఏడుగుల మేరకు ఎత్తి 32 వేల 148 క్యూసెక్కులను ఎస్‌ఎల్ బీసీ ద్వారా 2400 క్యూసెక్కులను వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులను మొత్తంగా 87 వేల 188 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరదనీరు కూడా తగ్గు ముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో గురువారం సాయంత్రానికి 589.40 అడుగులుగా ఉంది. శ్రీశైలంలో 884.40 అడుగులుగా ఉండగా ఎగవ నుండి రెండు లక్షల 44వేల 330 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

*చిత్రం... సాగర్‌లో నాలుగు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు