తెలంగాణ

బడుగుల ఆశాజ్యోతి దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 13: బడు గు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బండారు దత్తాత్రేయ అని పలువురు వక్తలు అన్నారు. బండారు దత్తాత్రేయ హిమచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకరం చేసిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతిలో ‘పౌర సన్మా న సభ’ నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్, రిటైర్డ్ ఐఏఎస్ వినోద్ కుమార్, నటుడు సుమన్ హాజరయ్యారు. దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. దత్తాత్రేయ నమ్మిన సిద్ధాంతల కోసం కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం పని చేశారని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించి రాజకీయల్లో రాణించి అనేక పదవులను చేపటారని వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోధించాలని ఆకాక్షించారు. బీసీ సమస్యల పరిష్కరంలో దత్తాత్రేయ చోరవ తీసుకోవాలని అన్నారు. రాజ్యంగ బద్ధంగా నడుచుకుంటూ పరిపాలన కొనసాగిస్తానని హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు.