తెలంగాణ

రూ.25 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వౌలిక సదుపాయాలు, పౌరులకు సదుపాయాల ఏర్పాటు ఇతోధికంగా రాష్ట్రప్రభుత్వం నిధులు ఖర్చుపెడుతోంది. 1971లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం జనాభాలో 18శాతం జనాభా ఉండగా, 2011 నాటికి 38 శాతానికి చేరింది. నగరాల్లో ప్రస్తుతం మొత్తం జనాభా 1.36 కోట్లకు చేరుకుంది. 40 సంవత్సరాల్లో నగర ప్రాంతాల్లో 21 శాతం జనాభా పెరిగినట్లు సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్ 2019 పేర్కొంది. రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఇష్టం వచ్చినట్లు భవన నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ మున్సిపపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని ప్రకారం అన్ని మున్సిపాలిటీలు తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి అమలు చేయాలి. దీంతో పాటు జీఐఎస్ మ్యాప్‌ను అనుసంధానం చేయాలి. పట్టణప్రాంతాల్లో వీధి వ్యాపారుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో 69093 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వీరిలో 65,342 మందికి గుర్తింపుకార్డులను ఇచ్చారు. 22885 మందికి వ్యాపారాలను నిర్వహించేందుకు ధృవపత్రాలను ఇచ్చారు. 66 మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులపై సమగ్ర సర్వేను పూర్తి చేశారు.
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరాశ్రయులకు 26 షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో 1193 మందికి ఆశ్రయం కల్పించారు. 50 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేందుకు ఉన్న సహాయకులకు షెల్టర్లను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర నిర్మూలన పథకం కింద 1.47 లక్షల స్వయం సహాయక బృందాలనుర్పాటు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.245.90లక్షల నిధులను విడుదల చేశారు. జీఎస్‌ఎంసీ పరిధిలో 146 అన్నపూర్ణ భోజన స్కీంను అమలు చేస్తున్నారు. ప్రతి రోజూ 40వేల మంది ఈ స్కీం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో భోజనం ఏచస్తున్నారు. ప్రతి భోజనానికి రూ.24.25 ఖర్చవుతుంది. ఇందులో జీహెచ్‌ఎంసీ రూ. 19.25 ఖర్చును భరిస్తోంది. వినియోగదారుడు రూ. 5 చెల్లిస్తే భోజనం పెడుతున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన స్ట్రాటేజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)ని అమలు చేస్తున్నారు. ఈ ప్లాన్ అమలుకు రూ.25వేల కోట్ల ఖర్చవుతుందని అంచనావేశారు. మేజర్ కారిడార్లు 11, స్కై వేస్ 7 నిర్మిస్తారు. 54 జంక్షన్లలో గ్రేడ్ సపరేటర్లను నిర్మిస్తారు. దుర్గం చెరువు, ఎల్‌బీ నగర్, బయో డైవర్సిటీ పార్కు జంక్షన్, బహదూర్‌పుర జంక్షన్, ఒవైసీ జంక్షన్, షేక్‌పేట ఓయూ కాలనీ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో ఎస్‌ఆర్‌డీపీ రోడ్ల నిర్మాణానికి రూ.2389.64 కోట్లను కేటాయించారు. ఇక్కడ పనులను వేగవంతంగా చేపట్టారు. ఉప్పుగూడ, తుకారాం గేట్, లాలాపేట ఆర్‌వోబీల నిర్మాణానికి రూ.99.65 కోట్లతో పనులను చేపట్టారు. బాలానగర్ ఎక్స్‌రోడ్డు ఫ్లైవోవర్‌ను రూ.2621.86 కోట్లతో చేపట్టారు.
కొత్త టెక్నాలజీతో వినూత్న పద్ధతుల్లో ఫ్లైవోవర్లు, అండర్‌పాస్ నిర్మాణాలు చేపట్టినట్లు సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ 2019లో పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 3132 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో 2653 చెరువులపై సర్వే పూర్తయింది. బాటసింగారం, మంగలపపల్లి వద్ద లాజిస్టిక్ పార్కును పీపీపీ పద్ధతిలోనిర్మించాలని ప్రతిపాదించారు. జలవిహార్ వద్ద పది ఎకరాల స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో లేక్ ఫ్రంట్ పార్కు నిర్మాణానికి పనులను కూడా ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది.