తెలంగాణ

ఏపీలో ‘కారు’ గుర్తు ఉంచాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘కారు’ను ఉంచాలా? వద్దా? అని ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అన్ని పార్టీలతోవరుసగా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతోంది. శుక్రవారం టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. సమావేశానంతరం వినోద్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం సెక్షన్(ఏ, ఈ) కింద ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్లు కేటాయింపులపై నోటీసులు ఇచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రాంతీయ పార్టీగా గుర్తింపుఉందని, రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పార్టీ పోటీ చేస్తోందని వివరించారు. ఏపీలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటికి నిలపలేని నేపథ్యంలో కారు గుర్తును ఆ రాష్ట్రంలో ఉంచాలా? వద్దా? అన్న దానిపై స్పందించాలని నోటీసులు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే తమ నిర్ణయం వెల్లడిస్తామని ఈసీ అధికారులకు తెలిపినట్టు వినోద్‌కుమార్ వెల్లడించారు.