తెలంగాణ

గిరిజన సంక్షేమానికి కృషి: మంత్రి సత్యవతి రాథోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రి పదవీ చేపట్టిన ఆమె శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖాధికారులు, ఉద్యోగులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమ శాఖకు తనను మంత్రిగా చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు బాధితులం, ప్రస్తుతం బాధ్యులంటూ ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి గిరిజన సంక్షేమ శాఖాభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి పిలుపునిచ్చారు. సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్, కమిషనర్ క్రీస్టీనా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖలో కొనసాగుతున్న గిరిజన విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, వాటి తీరుతెన్నులు, భావి ప్రణాళికల గురించి మంత్రికి వివరించారు.