తెలంగాణ

విమోచన దినోత్సవానికి బీజేపీ భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల సందర్శించే కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ ఖరారు చేసింది. 17వ తేదీ మంగళవారం ప్రతి పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్ రెడ్డి, విమోచన కమిటీ చైర్మన్ ఎన్ శ్రీవర్థన్ రెడ్డి, కమిటీ కన్వీనర్ సీహెచ్ స్వామీ గౌడ్ తెలిపారు. అన్ని మండల, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తిరంగా బైక్ యాత్రను నిర్వహిస్తామన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పటన్‌చెరులో బహిరంగ సభను నిర్వహిస్తారు. 14వ తేదీన నిజామాబాద్ జిల్లా, 16వ తేదీన భైరాన్‌పల్లి, అప్పంపల్లి, కొమురం భీం, వెయి ఉరుల మర్రి, ఎర్రుపాళెం గ్రామాలను భారతీయ జనత పారీట నేతలు సందర్శిస్తారు.