తెలంగాణ

జాతీయ వ్యవసాయ మార్కెట్‌పై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో అమలు అవుతున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) అంశంపై శుక్రవారం రాష్ట్ర స్థాయిలో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సీ. పార్థసారథి, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పీకే. స్వైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మాసాబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో జరిగిన సమావేశంలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌పై సమీక్షించారు. ఈ సమావేశంలో ముందుగా వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు జీ. లక్ష్మీబాయి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 189 మార్కెట్ కమిటీలకు గాను 47 మార్కెట్ కమిటీలలో ఈ-నామ్ అమలు అవుతున్నట్లు తెలిపారు. రూ.8548 కోట్ల విలువైన 27.51 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఈ-నామ్ ద్వారా అమ్మినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్వైన్ ఈ-నామ్ అమలులో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని అభినందించారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ గోదాములను మార్కెట్లుగా గుర్తించి రైతులకు కొత్త మార్కెట్‌లుగా అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.
అంతర్ రాష్ట్ర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన విధివిధానాలను తయారు చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, పీ. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.