తెలంగాణ

ప్రతి విద్యార్థీ ఇక స్వచ్ఛ దూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో స్వచ్ఛ పాఠశాలలను రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ భారీ ప్రణాళికనే రూపొందించింది. ఇందుకోసం రాష్టస్థ్రాయిలో ఉన్నతస్థాయి కమిటీ ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయనుంది. స్వచ్ఛ పాఠశాలల రూపకల్పనలో అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించేందుకు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి శుక్రవారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఏదో ఒక్క రోజు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించేందుకు పరిమితం కాకుండా ప్రతి రోజూ స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా పనిచేసే స్థితిలో ఉంచుకోవాలని, వినియోగించినపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోర్డులు పెట్టాలని అన్నారు. చేతులు శుభ్రపరుచుకోవడం, ప్రతి రోజు స్నానం, గోర్లు కత్తిరించుకోవడం పరిశుభ్రత అలవాటు చేయాలని పేర్కొన్నారు. పిల్లలను భాగస్వామ్యులను చేసి స్వచ్ఛ కమిటీలను నియమించాలని, స్వచ్ఛ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థీ స్వచ్ఛ దూతగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి పాఠశాలలో స్వచ్ఛ నమస్కారం అమలుచేయాలని, స్వచ్ఛతయే సేవ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనాలని, సంపూర్ణ స్వచ్ఛ పాఠశాలలుగా ఎదిగేందుకు ప్రగతి చూపేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని అన్నారు. హాజరుశాతం పెంచాలంటే స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని, ఆగస్టులో నిర్వహించిన హాజరుమాసోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లోనూ దానిని కొనసాగించాలని అన్నారు. తరగతి గదుల్లో చెత్తబుట్టలు నిర్వహించాలని, తడి, పొడి చెత్త నిర్వహణ, తాగునీటి పరిశుభ్రత, నిర్వహణ ,వృధానీటి నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యపరీక్షలు పర్యవేక్షించాలని, ఈ మార్గదర్శక సూత్రాలకు మార్కులు ఇస్తామని, హెడ్మాస్టర్లు, టీచర్లు తమతమ స్కూళ్లలో స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణపై ప్రతినెలా స్వయంగా మార్కులు వేసుకుని స్వీయమూల్యాంకనం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధన్ రెడ్డి, పాఠశాలవిద్య కమిషనర్ టీ విజయకుమార్, సైట్ డైరెక్టర్ సీహెచ్ రమణకుమార్, సమగ్రశిక్ష ఎఎస్‌పీడీ పీవీ శ్రీహరి, మోడల్ స్కూల్స్ జేడీ లింగయ్య, సమగ్ర శిక్ష జేడీ జీ రమేష్, సమగ్ర శిక్ష ఎఎంఓ ఎస్‌కే తాజ్‌బాబు, డాక్టర్ శిరీష, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ శ్రీనాధ్, సమగ్రశిక్ష సీఎంఓ రాములు, వినోద్ తదితరులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయకుమార్, ఐటీసీ ఘనవ్యర్థపదార్థాల యాజమాన్య నిపుణుడు ఉమాకాంత్ వారికి పలు సూచనలు చేశారు.