తెలంగాణ

తెలంగాణ ద్రోహులు చేరి భ్రష్టు పట్టిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 13: సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య గుడ్ బై చెప్పారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీబీజీకేఎస్ యూనియన్‌కు ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు తన రాజీనామా లేఖను పంపిన్నట్లు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం 2003 జనవరి 27న టిఆర్‌ఎస్ అనుబంధ సంఘంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) స్థాపించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటైతే బొగ్గు గని కార్మికుల బతుకులు మారుతాయని, టిబిజికెఎస్ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె చేసి చరిత్రను సృష్టించామని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా జాతీయ సంఘాలను యూనియన్ ఎన్నికల్లో ఓడించి గనులపై గులాబీ జెండాను ఎగురవేశామని, అనంతరం ఎన్నో కార్మిక హక్కులను తన ఆధ్వర్యంలో సాధించామని అన్నారు. ఉద్యమానికి అడ్డుపడిన ద్రోహులు యూనియన్‌లో చేరి భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. వెంకట్రావు అధ్యక్షులుగా అయినప్పటి నుంచి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనలో పూర్తిగా విఫలమవుతూనే వస్తున్నారని, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారని మండిపడ్డారు. వారి వైఖరి నచ్చకనే యూనియన్‌ను రాజీనామా చేస్తున్నట్లుగా వివరించారు. కార్మికులే తనకు అధిష్టానమని, కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం బాయి బాట పేరుతో కార్మికుల ముందుకు వెళ్తున్నానని అన్నారు. కార్మికుల అభీష్టం మేరకు భవిష్యత్‌లో తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. నాగపల్లి సాంబయ్య, అప్పని శ్రీనివాస్, మాదాసు రామ్మూర్తి, సారంగపాణి, గాదె సురేష్, దశరథం, సదాశివ్, నాయిని నర్సింహ రెడ్డి, పర్లపల్లి రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.