తెలంగాణ

యూసీఐఎల్ అధికారుల ఆచూకీ కోసం జేఏసీ అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, సెప్టెంబర్ 13: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో యురేనియం తవ్వకాల కోసం బోర్‌వెల్‌తో డ్రిల్లింగ్ చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించేందుకు యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) అధికారులు ఈ ప్రాంతానికి వచ్చారనే సమాచారం మేరకు నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక రాజకీయ జేఎసీ నేతలు శుక్రవారం రెండు మండలాల పరిధిలోని జంగంరెడ్డిపల్లి, ఉడిమిల్ల, పెట్రాన్‌చెన్ చెంచుపెంట సమీపంలోని అటవీ ప్రాంతాలలో బృందంగా వెళ్లిన జేఏసీ నేతలు అధికారుల జాడకోసం గాలింపు చేపట్టారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి వచ్చిన యూసీఐఎల్ అధికారులు ఈ ప్రాంతానికి కూడా వచ్చారనే సమాచారం మేరకు జేఎసీ నేతలతోపాటు ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజుల క్రితం అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్, మనె్నవారిపల్లి మీదుగా అమ్రాబాద్, పదర మండలాలలోని గ్రామాలకు రావచ్చనే ప్రచారం జరిగింది. దీనితో ఆయా ప్రాంతాలనుంచి వచ్చే దారులపై స్థానిక ప్రజలతో కలిసి అధికారుల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారుల ప్రత్యక్ష సహకారంతోనే ఈ అదికారులు నల్లమల ప్రాంతానికి వస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం అమ్రాబాద్‌లో ఫీల్డు డైరెక్టర్ ఎకే సిన్హా, విశ్రాంత ఉద్యోగులను ఉద్యమ కారులు మన్ననూర్‌లో అడ్డగించి జేఎసీ నేతలు తిప్పి పంపిన విషయం తెలిసిందే. యురేనియం కార్పొరేషన్ అధికారులను ఎట్టి పరిస్థితులలో నల్లమలలో అడుగుపెట్టనియ్యమని జేఎసీ నేతలతోపాటు గ్రామాల ప్రజలు అన్నారు. నల్లమలలో శుక్రవారం తిరిగిన వారిలో జేఎసీ కన్వీనర్ నాసరయ్య, బాలకిష్టయ్య, మోహన్, జమీల్, పవన్, మల్లేష్ తదితరులు ఉన్నారు.