తెలంగాణ

2023లో రాష్ట్రంలో అధికారం బీజేపీదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 13: భారత ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నేటి శనివారం నుండి ఈ నెల 20వరకు ‘ సేవా సప్తాహ ’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17న ప్రధాన మంత్రి మోడీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్ర పార్టీ నిర్ణయించిందన్నారు. ఆసుపత్రులు, వెనుకబడిన వసతి గృహలు, ఆనాద ఆశ్రమాలో పండ్లు, ఇతర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా వైద్య, రక్తదాన శిభిరాలు నిర్వహించడంతో పాటు దివ్యాంగులకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించామని అన్నారు. మోదీ పిలుపుమేరకు ప్లాస్టిక్ వస్తువులను వాడబోమన్నారు. వీటిని పరిరక్షించేదుకు కళాశాలలు, స్కూల్‌ల్లో విద్యార్ధులచే ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన రజాకార్ల పాలనను తలపిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ కబంధ హస్తల నుండి నాయకులు బయటపడి, మలిదశ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. 2023లో అధికారం బీజేపిదేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు 17 సెప్టెంబర్‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన ఆయన ఎందుకు మాట మార్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినం విషయంలో అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ద్వంద వైఖరీని అవలంభిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్దిచెప్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే నిజాం సమాధి వద్ద మొకరిల్లాడని అన్నారు. ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 17 సెప్టెంబర్‌ను బీజేపి అధికారంలోకి రాగానే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల పైన జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రభుత్వం ఎంత నిర్భందం పెట్టిన తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే కొండెటి శ్రీ్ధర్, రావుల కిషన్, బొడిగ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.