తెలంగాణ

మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకున్న కొండగట్టు బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 13: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్‌రావుపేట గ్రామంలో నిర్వహించే 30రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామసభలో పాల్గొనేందుకు వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ శరత్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దావ వసంతల కాన్వాయ్‌లను కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. హిమ్మత్‌రావుపేట శివారులోని రోడుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన, క్షతగాత్రులైన కుటుంబాల్లో కొందరికి ఇప్పటికీ ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదని, ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని, బాధిత కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫైనల్ రిపోర్ట్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యంతో ఎల్‌ఐసీ భీమా డబ్బులు కూడా అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పోతరాం పెద్ద చెరువు రిజర్వాయర్ నుంచి నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల వరకు 7.5 కి.మీల గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి 12 ఏళ్ల క్రితం టెండర్ నిర్వహించారని, భూసేకరణ చేపట్టి బాధితులకు నష్టపరిహారం అందించాలని కానీ పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభించలేదని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలోనే జలశయం ఉన్నప్పటికీ 7 గ్రామాల ప్రజలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావిటీ కెనాల్ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని నినాదాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనం దిగి రాకపోగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధితులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. సుమారు గంటపాటు బాధితులు రాస్తారోకో చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు కాన్వాయ్‌కి దారి వదిలారు. మంత్రులను అడ్డుకునేందుకు ఆందోళనకారులు మళ్లీ సిద్ధమయ్యారనే సమాచారంతో హిమ్మత్‌రావుపేటలో గ్రామసభ ముగిసాక కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా మళ్లించారు.