తెలంగాణ

ఎమ్మెల్యే షకీల్ హైడ్రామాకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, సెప్టెంబర్ 13: మంత్రి వర్గంలో స్థానం కోసమో లేక అధిష్టానం దృష్టిలో పడేందుకో తెలియదు కానీ బీజేపీ ఎంపీ అరవింద్‌తో భేటీ ద్వారా తెరకెక్కిన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్ హైడ్రామాకు తెరపడినట్టేనని చెప్పవచ్చు. తెరాస పార్టీకి చెందిన షకీల్ అహ్మద్ బీజేపీకి చెందిన అరవింద్‌తో బేటీ కావడం తెరాసలోనే కాకుండా అన్ని పార్టీలలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. మంత్రి కేటీఆర్ రంగంలోనికి దిగడంతో కొన్ని గంటలలోనే ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మీడియా ముందుకు వచ్చి తాను పార్టీని వీడేది లేదంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. గురువారం ఉదయం ఆయన ఎంపీ అరవింద్‌తో బేటీ కాగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన అనుచురులు కొందరు, తెరాస సోషల్ మీడియా ఇన్‌చార్జీలు అరవింద్‌తో భేటీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టింగ్‌లు చేసారు. దాంతో షకీల్ పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది. అధిష్టానం ఏమి చర్యలు చేపట్టిందో తెలియదు కానీ రాత్రి కల్లా షకీల్ అహ్మద్ హైడ్రామాకు పూర్తి స్థాయిలో తెరపడింది. రాత్రి తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ వీడేది లేదంటూ స్పష్టం చేశారు.
తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ గాడ్ ఫాదర్‌తో సమానమని, తాను బ్రతికినన్ని రోజులు తెరాసలోనే కొనసాగుతానని తెలియచేయడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయినా శుక్రవారం మరోమారు జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం తం ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌తో సమావేశమై మరోమారు చర్చలు జరిపారు. షకీల్ అభిప్రాయాలను తెలుసుకునేందుకే అధిష్టానం మరోమారు మంత్రి వేములను రంగంలోనికి దింపినట్లు తెలుస్తోంది.