తెలంగాణ

హిమాచల్ ప్రదేశ్‌సాంస్కృతిక, పర్యాటక శాఖలతో మన రాష్ట్రాన్ని సమన్వయం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 13: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లనుందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాలు పెద్దసంఖ్యలో ఉన్నాయని ఆధ్యాత్మిక కేంద్రంగా హిమాచల్ ప్రదేశ్ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ఉన్న పుణ్య క్షేత్రాలను, హిమాచల్ ప్రదేశ్ పుణ్యక్షేత్రాలను ఇరు రాష్ట్రాల ప్రజలు సందర్శించే విధంగా రెండు రాష్ట్రాల సాంస్కృతిక, పర్యాటకశాఖ, దేవాదాయ శాఖల మధ్య సమన్వయం కోసం చొరవ తీసుకుంటానన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను ఏటా కోట్లాది మంది సందర్శిస్తుంటారని, యాదాద్రి, రామప్ప, జంట నగరాల్లోని సందర్శన స్థలాలను సైతం లక్షలాది మంది సందర్శిస్తుంటారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక దర్శనీయ క్షేత్రాల్లో, పర్యాటక ప్రాంతాల్లోను, పోరాటాల్లోనూ సారుప్యత ఉందన్నారు. సమాజంలో శాంతి, సహజీవనంతో సాగాలంటే నైతికత, ఆధ్యాత్మికత పెంపొందించాల్సిన అవసరముందన్నారు. తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవ్వడం తనకే కాదు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. అంతకు ముందు గవర్నర్ దతాత్రతేయకు యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ పూలమొక్క అందించి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, నాయకులు దాసరి మల్లేశం, కర్నాటి ధనుంజయ, దంతూరి సత్తయ్య, బండ్రు శోభారాణి పాల్గొన్నారు.