తెలంగాణ

రాష్ట్రానికి కేంద్ర సాయమేదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 13: రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందడం లేదని, ప్రపంచంలోనే పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరూపాయి కూడా మంజూరు చేయలేదని, బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే రాష్రాభివృద్ధికి నిధులు తేవాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటలో గ్రామసర్పంచ్ పొనుగోటి కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. మొక్కలు నాటి, రోడ్లపై ఉన్న గుంతల్లో మట్టిని నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకోకుండా గ్రామస్తులంతా సమన్వయంతో చర్చించుకొని అభివృద్ధిలో అడుగు అడుగు కలిపి ముందుకెళ్లాలని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించలేదని, గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.30లక్షల కోట్లు చెల్లించిందని, కేంద్రం నుండి రాష్ట్రానికి కేవలం రూ.25వేల కోట్ల నిధులు మాత్రమే వచ్చాయని అన్నారు. కాన్వాయ్ ని అడ్డగింపును దృష్టిలో ఉంచుకొని మంత్రి మాట్లాడుతూ తాగునీటి విషయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు. అనంతరం సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలు అంకపూర్ గ్రామాలు కానున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ముందుకెళ్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహనం వహించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడకుంటే సంక్షేమ పథకాలు అమలయ్యేవా అని ప్రశ్నించారు. 3 నెలల్లో గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులను పోతారం నుండి ప్రారంభిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలోని 380 గ్రామాల్లో 30రోజుల ప్రణాళికను పకడ్బందిగా అమలు చేస్తున్నామని, కోతులకు ఆహారం అందించేందుకు మంకీ ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి 20కోట్ల నిధులను మంజూరు చేయాలని పంచాయతీరాజ్ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీచైర్మన్ దావ వసంత, జేసీ రాజేశం, ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పొనుగోటి ప్రశాంతి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.