తెలంగాణ

కేసీఆర్ పాలన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేంద్రం సహకారం లేకపోయినా, ఆర్థిక మాంద్యం మధ్య మంచి బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఇది నిజంగా అద్భుతమని, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప నిర్మాణమని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని ప్రశంసించారు. కేసీఆర్ పాలన ఆమోఘమని, ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నా, అన్ని వర్గాలను సంతృప్తిపరిచేవిధంగా నిధుల కేటాయింపు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో ఐదేళ్ల బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిందని, దీని వల్ల వోటాన్ అకౌంట్ కంటే రూ.36వేల కోట్ల తక్కువగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూ.1.42 లక్షల కోట్లకు కుదించడానికి కేంద్రం నుంచి రాష్ట్రం వాటాకు తగ్గట్టుగా నిధులు అందకపోవడమే కారణమన్నారు. కేంద్రం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల జీడీపీ ఐదు శాతానికి పడిపోయిందన్నారు. కాని కేసీఆర్ అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉందన్నారు. ఈ క్రెడిట్ కేసీఆర్ దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి రూ.69 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో రూ.1.77 లక్షల కోట్ల నిధులు రావాల్సి ఉండగా, కేవలం రూ.1.07 కోట్ల నిధులువచ్చాయన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవా పన్నువిధానాన్ని అమలు చేయడం వల్ల ఆర్థిక మాంద్యం పెరిగిందన్నారు. నిధుల మంజూరు చేయకుండా కేంద్రం జాప్యం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కేసీఆర్ సర్కార్ తీసుక్నున చర్యలను ఆయన ప్రశంసించారు. మైనారిటీల సంక్షేమానికి కేటాయించినట్లుగా పూర్తిగా నిధులు ఖర్చుచేయాలని ఆయన కోరారు.
బడ్జెట్‌లో మైనారిటీలకు 12 శాతం నిధులు కేటాయించాలని అక్భరుద్దీన్ డిమాండ్ చేశారు. మైనారిటీలకు ఆరువేలకోట్ల రూపాయలు కేటాయించి, మూడువేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కేటాయించిన మేరకు మొత్తం నిధులు ఖర్చు చేయాలని సూచించారు. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఆపివేశారని, వీటిని మళ్లీ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సమానంగా పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, మైనారిటీలకోసం 16 పథకాలు ప్రకటించి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెట్రోరైల్‌ను పాతనగరానికి పొడిగించాలన్నారు. పాతనగరవాసులకు తాగేందుకు గోదావరి లేదా కృష్ణానీటిని ఇవ్వాలని కోరారు. చార్మినార్ పరిసరాలను అభివృద్ధి చేయాలని కోరారు. రెండువేల డబల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారని, వీటిని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మైనారిటీల ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, సంబంధిత అధికారులను ఆహ్వానించి సమస్యలపై చర్చించాలని ముఖ్యమంత్రిని అక్భరుద్దీన్ కోరారు.