తెలంగాణ

‘ఐఆర్, పీఆర్‌సీ అమలులో జాప్యమెందుకు?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రతి ఐదేళ్లకో మారు యథాలాపంగా హక్కువగా రావల్సిన ఐఆర్, పీఆర్సీ అమలులో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని జాక్టో నేతలు జీ సదానందగౌడ్, ఎం రాధాకృష్ణ, ఇ రఘునందన్ నిలదీశారు. ఎస్‌టీయూ భవన్‌లో జరిగిన జాక్టో విస్తృతస్థాయి సమావేశంలో పలు సమస్యలపై సుదీర్ఘసమావేవం జరిగింది. ఉపాద్యాయ, ఉద్యోగుల నిరంతర పోరాటం వల్ల తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, స్వరాష్ట్రంలో స్వీయపాలనలో తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురువుతున్నామని వారు ఆవేదన చెందారు. జూన్ 2న ఐఆర్, ఆగస్టు 15న పీఆర్‌సీ అని ఆర్భాటంగా ప్రకటించిన నేతలు కనీసం ఆ వైపున కూడా చూడటం లేదని అన్నారు. అన్ని సమస్యలూ పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వాన్ని కదిలేలా చేయాలంటే మహా ఐక్యవేదిక ఏర్పాటు కావల్సి ఉందని వారు చెప్పారు.